జైశ్రీరామ్.
5. ఓం ఉగ్రసింహాయ నమః.
పణవ వృత్త గర్భ సీసము.
మహిత! గుణాభిరామా! రావయ. రమణీ - యాక్షాక్షయా! నరహరి! నుతింతు.
నో దేవ! సత్య ప్రేమోద్భాసుఁడ! శ్రియముల్ - కొల్పన్ గ నన్నెంచి, నిల్ప రమ్ము.
మాన్యుఁడా! వినుము. నీమంబొప్పఁగ నిను నేఁ - గొల్తున్ హృదిన్నీవు కొలువు తీరు.
మాతల్లి యైన శ్రీమాతాశ్రయ! శ్రిత స - త్పోషా! మదిన్ నిత్య తుష్టినిమ్ము.
గీ. నీవు కాకున్న మాకింక నేతలేరి? - యుర్వి దౌష్ట్యంబులణచెడి *ఉగ్రసింహ*!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
5వ సీస గర్భస్థ పణవ వృత్తము. (మ న య గ .. యతి 6)
రామా! రావయ. రమణీయాక్షా! - ప్రేమోద్భాసుఁడ! శ్రియముల్ కొల్పన్.
నీమంబొప్పఁగ నిను నేఁ గొల్తున్ - శ్రీమాతాశ్రయ! శ్రిత సత్పోషా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ గొప్పవాఁడా! మంచిగుణములచే అందముగ
శోభించువాఁడా! రమణీయమైన నాశ రహితుఁడా! ఓ నరహరీ! నిన్ను నుతింతును నీవు రమ్ము. ఓ దేవా! సత్యములోను,
ప్రేమలోను ప్రకాశించువాఁడా!
నన్ను నీవు గుర్తించి నాకు శ్రేయములు కొలుపుచు నిలబెట్టుటకు రమ్ము. ఓ
మాననీయుఁడా! నామాట వినుము. నేను నిన్ను నియమముతో కొలుచుదును. నా మనసులో నీవు కొలువు తీరుము. మా
తల్లి శ్రీమాతను ఆశ్రయించినవాఁడా!
ఆశ్రయించిన మంచి వారిని పోషించువాఁడా! నా మనసుల నిత్యసంతుష్టిని
కల్పింపుము. భూమిపై దుర్మాగములనణచెడి ఓ ఉగ్రసింహా! నీవు కాకున్నచో ఇంక మాకు నాయకులేరి?
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.