గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 56వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

56. దారుల్ గనంబరిచి నేరంబులన్ గొలిపి నేరంబులన్ బొనరచన్

కారుణ్యమున్ విడిచి, పారింతు వేలమము నీరీతి చేయఁ దగునా?

శ్రీరామ రక్షణగ నేరీతి మమ్ములను నీ రాక నిల్పునొ కదా.

యో రాక్షసాంతకి! సదా రక్షగా నిలుము కోరన్ వరంబులు సతీ!

భావము.

ఓ సతీ మాతా! తప్పుడు ప్రవర్తనలకు దారులు మాకు చూపుచు నేరములు 

చేసి, మేము నేరములు చేసినచోదయను విడిచి, మమ్ములను భయముతో 

పరుగులు తీయింతువుకదా, ఈ విధముగా నీవు మమ్ములను చేయుట తగునా 

తల్లీ? నీవు వచ్చుట శ్రీరామ రక్షణముగా మమ్ములను ఏ విధముగా 

నిలుపునోకదా తల్లీ. రాక్షస సంహారిణివయిన ఓ తల్లీ! ఇక నీవు 

మాకెల్లప్పుడూ రక్షగా ఉండుమమ్మా.  ఏ వరములూ నిన్ను 

కోరను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.