గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 46వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

46. ధీశక్తి వీవగుచుఁ బ్రాశస్త్యమున్ గొలుపుమా, శాంతి గొల్ప, నిఁక నీ

వే శాశ్వతంబగుచు, నా శాంతి వీ వవగ నాశించి నిన్ గొలువనీ.

యాశా పరాఙ్ముఖుఁగ నీ శక్తితోఁ గని దురాశల్ విడన్ గొలుపుమా. 

యో శాస్త్ర భాసిని! మహేశాని! నిన్ గొలుతు భాసించ నో వర సతీ!

భావము. 

ఓ మహేశ్వరీ! శాస్త్రములయందు ప్రకాశించు ఓ శ్రేష్ఠురాలివయిన సతీ 

మాతా! నాకు శాంతి ప్రసాదించుట కొఱకు నాలో బుద్ధియొక్క శక్తివి నీవే 

అగుచు, ప్రశస్తిని కలిగించుము తల్లీ! ఇకపై నీవే నాకు శాశ్వతమగుచు, నా 

శాంతివి నీవే అగునట్లుగా ఆశించుచు నిన్ను సేవించనీయుమమ్మా. 

ఐహికమయిన ఆశలకు విముఖునిగా నన్ను నీ శక్తితో చూచి, దురాశలను 

విడిపోవునట్లు చేయుమమ్మా. నాలో నీవు ప్రకాశించుట కొఱకు నిన్ను నేను 

సేవింతునమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.