గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).26వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

  జైశ్రీరామ్. 

26. పూర్ణంబు నీవె, యిల వర్ణంబులీవె, శశి పూర్ణాకృతిన్ గలవుగా. 

కర్ణామృతంబయిన పర్ణంబులీవెకద పూర్ణేందుబింబ వదనా.

స్వర్ణంబు నీవె కద స్వర్ణంబు లీవెకద ఘూర్ణించు మేఘుఁడవుగా.

చూర్ణంబు చేయుమిక దుర్నీతులన్ కని యపర్ణా! కృపం గను సతీ! 

భావము.

కృపతో చూచెడి ఓ సతీమాతా! భూమిపైనీవు పూర్ణ స్వరూపవు. సప్త 

వర్ణములు నీవే. చంద్రుని పూర్ణ స్వరూపమున కూడా నీవే 

ఉంటివి కదా. ఓ పౌర్ణమి చంద్రునిపోలు ముఖము కల తల్లీ! 

వినసొంపుగానుండు వేదమంత్రములు నీవే కదా. బంగారము నీవే 

కదా,  మంచిని వెలువరించు అక్షరములు నీవే కదా, ఘూర్ణించునటువంటి 

మేఘము నీవే కదా. ఓ యపర్ణా! దుర్నీతులయిన పాపులను సంహరింపుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.