గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 102వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

102. శక్తి ప్రదా! కనుచు రక్తిన్ సదా ప్రజను, యుక్తంబుగా నడుపుమా.

భుక్తి ప్రదా! ధిషణ శక్తి ప్రదాయివయి. రక్తిన్ నినున్ గొలవనీ 

యుక్తి ప్రదా జనుల శక్తిన్ వెలుంగు మిల నక్తంచరాళికిని స

న్ముక్తి ప్రదాయివిగ, . ముక్తావళిన్ గొనుమ శక్తీ! దయామయ సతీ!

భావము.

దయతో నిండిన ఓ సతీ మాతా! ఓ శక్తిస్వరూపిణీ! శక్తిప్రదాతవయిన ఓ తల్లీ! 

అనురాగముతో చూచుచు ఎల్లప్పుడూ ప్రజలను తగినట్లుగా 

నడిపించుమమ్మా. మాకు ఆహారమును ప్రసాదించెడి తల్లీ! మాకు 

బుద్ధిశక్తినొసగుదానివయి, అనురాగముతో నిన్ను సేవించనిమ్ము. మాకు 

యుక్తిని ప్రసాదించు జననీ! ప్రజలయొక్క శక్తిలో నీవే 

ప్రకాశింపుము, నిశాచరులగు చోరాదులకును ముక్తినొసగు తల్లీవి! 

ఈ పద్యములనెడి ముత్యముల సమూహమును స్వీకరింపుము. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.