గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2023, గురువారం

లేఖాః ప్రాగాయతాః పంచ రేఖాః ..... ఈ శ్లోకము పూజా సమయంలో స్వస్తిక్ గుర్తు వేసెడి వివరణము.

 జైశ్రీరామ్. 

ఈ శ్లోకము పూజా సమయంలో స్వస్తిక్ గుర్తు, 

దానికి తూర్పున ఏనుగు కుంభస్థలాకారము, 

పశ్చిమమున కలశాకారము వచ్చునట్లు రేఖలు వేయవలెను.

శ్లో.  లేఖాః ప్రాగాయతాః  పంచ రేఖాః  పంచోదగాయ తాః 

రేఖే ద్వే కోణతాః కోణే  తిర్యగ్రేఖా చతుష్టయమ్  

పశ్చిమే కలశాకారం పురతో గజ కుంభవత్ 

పదాత్ పార్శ్వ గతో యేన  యిదం స్వస్తిక లక్షణమ్.

ఈ శ్లోకము వినాయకునికి చెందిన పూజలలో ఎక్కడైనను ఉండవచ్చు. 

లేక లింగ పురాణంలో ఉండవచ్చును.

ఆయతాః = పెద్దవైన, 

పంచ రేఖాః = ఐదు గీతాలు, 

ప్రాక్ = తూర్పునకు; 

ఆయతాః = పెద్దవైన, 

పంచ రేఖాః = ఐదు గీతాలు, 

ఉదక్ = ఉత్తరమునకు (మధ్యలో కలియునట్లు వేయవలెను).

రేఖే = గీతలలో, 

ద్వే కోణే = రెండు మూలలయందు 

( తూర్పు రెండు మూలలు, ఉత్తరము రెండు మూలలు ప్ర

త్యేకముగా రేఖలు అని అర్థము స్వీకరించవలెను), 

చతుష్టయం = నాలుగు దిక్కులు కలియునట్లు రెండు గీతలు 

(కలియునట్లు వేయవలెను).  

పదాత్  = మార్గముల నుండి, 

పార్శ్వగతః = ప్రక్కలకు వెళ్ళునట్లుగా, 

తిర్యక్ = అడ్డముగా, 

రేఖాః = గీతలు ( వేయవలెను). 

యేన = ఈ ప్రకారముగా గీయటచే, ( ఏర్పడు ఆకారము), 

స్వస్తిక లక్షణమ్ = స్వస్తిక అను (గుర్తు) బంధము 

ఏర్పడుటకు లక్షణము. (ఈ స్వస్తిక గుర్తునకు) 

పురతః = ముందు భాగములో ఏనుగు కుంభస్థలము వలె, 

పశ్చిమే = పడమర వైపునకు, 

కలశాకారం = కలశము ఆకారములో, 

రేఖాః = గీతలు, ( వేయవలెను). 

పూజా సమయంలో స్వస్తిక్ గుర్తు, 

దానికి తూర్పున ఏనుగు కుంభస్థలాకారము, 

పశ్చిమమున కలశాకారము వచ్చునట్లు రేఖలు వేయవలెను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.