గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).9వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

9. పల్కంగ నేరవొకొ? యల్కన్ మదిన్ నిలిపి, కల్కీ! హృదబ్జ నిలయా! 

పల్కంగనే వరము లొల్కంగఁ దప్పదని మేల్కొంచు పల్క వెరపా? 

కల్కి ప్రభావమిల మేల్కాంచె చూడు మిక మేల్కొల్పు శిష్ట జనులన్,  

పల్కించు పద్యములు చిల్కించు సన్నుతులు పల్కించు మెల్లెడ సతీ! 

భావము.

నా హృదయ పద్మాసీనవైయున్న ఓ సతీమాతా! నాపై అలకఁ బూని నాతో 

మాటాడ లేకున్నావా? ఒకవేళ పలుకరించినట్లయిన వరములు నా కొసగ 

తప్పదని భయముతో పలుకరించుట లేదా? కలి యొక్క మాయా ప్రభావము 

మేలుకొన్నది చూడుము. మంచివారిని నీవిక మేలుకొలుపుము తల్లీ! ఆ 

కలిప్రభావమును మాపు విధముగా పద్యములు పలుకజేయుము, మంచి 

మాటలను చిలుకు నట్లు చేయుము. అవి అంతటా వ్యాపించునట్లు ఆమంచిని 

చేయుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.