గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 89వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

89. ముల్లోకముల్ కొలిపి యుల్లాసమొప్పగను తల్లీ దయన్ విడుచుచున్

గల్లోలముల్ కొలిపి యుల్లంబులన్ కుదుపుటెల్లన్ ముదంబొ కనగా.

చల్లంగ చూచితివొ సల్లీల నిన్గొలుతుముల్లంబులన్ సతతమున్.

గల్లల్విడన్ గొలిపి ౘల్లంగఁ గావుముసముల్లాసివౌచును సతీ!

భావము.

ఓ సతీ మాతా! ఉత్సాహముతో ముల్లోకమలను సృజించిన నీవు దయ వీడి, 

కల్లోలములి పుట్టించి, మా మనస్సులను కుదుపుట నీకు సంతోషదాయకమా? 

నీవు మమ్ములను చల్లగా చూచుచున్నచో మా మనసులో ఎల్లప్పుడూ నిన్ను 

మంచిగా సేవించుదుము కదా. మాలో మాయలను విడుచునట్టులుగా చేసి, 

నీవు ఉత్సాహముతో ఉండి మమ్ములను చల్లగా కాపాడుమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.