గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 53వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

53. పాలింపుమా సుకృతినాలింపుమా కృపను నీలీలలన్ని తెలియన్,

గాలించి చూడ నిను పోలంగనెవ్వరిల లోలాక్షిరో మహిమలో.

నీ లీలలన్ బొగడి మాలోన నిన్ నిలిపి లోలోన పొంగుట తగున్. 

హేలన్ ననున్ గనుచు నేలన్ మనన్ గనుమ శ్రీలంద జేయుచు సతీ!. 

భావము.

ఓ సతీ మాతా! అమ్మా! నీవు నన్ను పరిపాలింపుముంఏను రచించిన ఈ మంచి 

అశ్వధాటి కృతిని నీలీలలన్నియు తెలియుట కొఱకు కృపతో వినుము. 

చంచలమైన అందమయిన కన్నులుగల ఓ తల్లీ! ఎంతగా వెదకి 

చూచినప్పటికీ గొప్పతనములో నీతోసరిపోలువారెవ్వరుండిరమ్మా? 

ఎవ్వరునూ లేరు. నీ లీలలను ప్రశంసించుచు మాలోనే నిన్ను నిలిపి ఉంచి, 

మాలోలోపల పొంగిపోవుటయే మాకు తగునుగదా అమ్మా. 

విలాసవంతముగానన్ను చూచుచు, సంపదలందఁజేయుచు, ఈ భూమిపై 

బ్రతుకువిధముగా చూడుమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.