గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 48వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

48. ఇల్లాలివై హరుని చల్లంగఁ గాచు పరమోల్లాసినీ భగవతీ! 

ముల్లోకముల్ గనుము చల్లంగ, సజ్జనుల యుల్లంబులన్ వెలుఁగుమా. 

కల్లల్ మదిం గనని యుల్లాసులన్ కనుమ యల్లారు ముద్దుగ భువిన్.

తల్లీ నినున్ దలతు నుల్లంబులో నిలుమ చల్లంగ నీవిక సతీ!

భావము.

ఓ సతీ మాతా! శివునకు పత్నివై చల్లగా కాపాడుచు మహదానందముగా 

ఉండెడి ఓ భగవతీమాతా! చల్లగా ముల్లోకములను చూచుహు మంచివారి 

హృదయములందు ప్రకాశించుచుడుమమ్మా. ఏమాత్రమూ మాయ 

లేనటువంటి ఉత్సాహవంతులను ప్రేమతో అల్లరుముద్దుగా 

కనుచుండుము. ఓ తల్లీ! నిన్ను తలంచెదను. ఇక నీవు నా హృదయములో 

చలాగా నివసించియుండుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.