గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).18వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

18. నీలాల నింగినిటులేలీలఁ జేసితివి? చాలన్ మదిన్ దలఁపగా, 

నీ లాలితంబు గని శూలిన్ మదిన్ గనిన పోలంగలాడె? యనరా? 

యేలీల పత్నివయి నీలో సగంబొసఁగి పాలింపఁగా నిడితివో? 

నీలాల నింగినట నీ లీల కానఁబడు మాలోనఁ గల్గిన సతీ! 

భావము.

ఓ సతీమాతా! ఈ అనంత నీలకాశమును నీవు ఏ విధముగా చేసితివమ్మా? నేను 

ఈ విషయమును మనసులో ఆలోచించుటకైనను సరిపోను. నీ లాలిత్యమును 

చూచి ఆ శివునిమనసులో ఊహించుకొన్నచో నీతో సరిపోలేడు అని 

అనుకొనకుందురా. నీవు ఏ విధముగా ఆతనికి భార్యవయి నీ శరీరమున 

సగభాగ మతని కొసగి అతనికి లోక పాలనాధికార మిచ్చావో కదా. మాలోపలనే 

కలిగిన ఓ తల్లీ! వినీలాకాశమున అక్కడ నీ లీల నాకు కనిపించునమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.