గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 41వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

41 శక్తిప్రదా! మహిత ముక్తిప్రదా! విమల భక్తిప్రదాయివి కదా. 

భుక్తి ప్రదాయివయి రక్తిప్రదాయివయి యుక్తంబునేలనిడవో? 

రక్తాక్షివై మహి విరక్తాళినే కనవు. రక్తిన్ విడన్ సుగుణభా 

రక్తిన్ ధరన్ తుడిచి భక్తిన్ సదా యిడుమ ముక్తిం గనం గను సతీ! 

భావము.

ముక్తి కలుగు విధముగా చూచు ఓ సతీ మాతా! శక్తినొసగు తల్లీ! గొప్ప ముక్తి 

నిచ్చెడి అమ్మా! నిర్మలమయిన భక్తినొసగు తల్లివి కదా నీవు. నీవు భక్తి 

నొసగుదానివయి యుండియు, ముక్తినొసగుదానివయి యుండియు, మాకు 

యుక్తమయినది ఎందుల కీయకుందువో కదా. మంచి గుణములతో ప్రకాశించు 

ఓతల్లీ! నీవు రక్తాక్షివయియుండియు, విరక్తులయిన వారి మదిలో అనురక్తిని 

బాపుటద్వారా విరక్తులనేలచూడవు? వ్యర్థమయిన్ అనురాగములను 

పోగొట్టి భక్తిని ప్రసాదింపుమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.