జైశ్రీరామ్.
శ్లో. జ్ఞానం ప్రధానం న తు కర్మ హీనం - కర్మ ప్రధానం న తు బుద్ధి హీనమ్ l
తస్మాదుభాభ్యాం తు భవేత్ప్రసిద్ధిః - న హ్యేక పక్షో విహగః ప్రయాతి ll
తే.గీ. జ్ఞానము గనప్రధానంబు, కర్మలేని
జ్ఞానసంపద వ్యర్థము, జ్ఞానహీన
కర్మ వ్యర్థము, రెండును కావలెనయ!
ఒక్క రెక్కతో పక్షి తానెక్కడెగురు?
భావము. జ్ఞానం ప్రధానమే కానీ, కర్మహీనమైన జ్ఞానం నిరుపయోగము.
కర్మ ప్రధానమే కానీ, జ్ఞానం లేని కర్మ కూడా నిష్ప్రయోజనమే. జ్ఞాన, కర్మ
సముచ్ఛయము వలననే మానవుడు తరిస్తున్నాడు. ఒక్క రెక్కతోనే పక్షి
ఎగుర లేదు కదా!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.