గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

కదర్థితస్యాపి హి ధైర్య వృత్తేః .. మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్

శ్లో.  కదర్థితస్యాపి హి ధైర్య వృత్తేః  -  న శక్యతే ధైర్యగుణః ప్రమార్ష్టుమ్‌

అధోముఖస్యాపి కృతస్య వహ్నేః  -  నాధః శిఖా యాతి కదాచి దేవ.  

(భర్తృహరి)

తే.గీ.  ఎట్టి దుఃఖము లాపదల్ నెట్టలేవు 

ధైర్యవంతును ధైర్యమున్ ధరణిపైన,

నగ్నిఁ గ్రిందికి త్రిప్పిన నాగకుండ

పైకె ప్రసరించునట్లుగా భవ్యచరిత!

భావము.  ధైర్య వంతునికి యెట్టి దుఃఖము, ఆపద  సభవించి ననూ అతని 

ధైర్యమును పోగొట్టుట అసాధ్యము అనగా తానెల్లప్పుడును ధైర్యము 

కోల్పోవడు.  అగ్నిని తలక్రిందులుగా పెట్టినను పైకి ప్రససరించునే కానీ 

అధోముఖము గా వెలుగదు కదా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.