గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 13వ శ్లోకం. 98 - 102. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

 శ్రీలక్ష్మీసహస్రనామావలిః 

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం. శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.


శ్లోజ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్రఫలప్రదా

దారిద్ర్యధ్వంసినీ దేవీ హృదయగ్రంథిభేదినీ 13

98. ఓం *జ్యోతిష్మత్యై* నమః

నామ వివరణ.

జనని జ్యోతిష్మతి అనగా మెఱుపు తీగయే అమ్మ.

తే.గీతగును *జ్యోతిష్మతీ!* నీకు దాసుడనని

కాచి రక్షించుటన్నది కచ్చితముగ,

దారితెన్నులు కనరాని  దారిఁ బాపి

వినుత జ్యోతిర్లతా! నాకు వెలుగునిమ్ము.

99. ఓం *మహామాత్రే* నమః

నామ వివరణ.

సృష్టిలోనే గొప్ప తల్లి మహామాత..

తే.గీజలధి జాతా! *మహామాత!*  జయము నీకు,

నిలువరించుము నా మదిన్, నిశ్చలముగ

నుండఁ జేయుము, భక్తితో  నిండు మదిని

నిన్ను సేవింపఁ జేయుమునిరుపమాక్షి!

100. ఓం *సర్వమన్త్రఫలప్రదా*యై నమః

నామ వివరణ.

సర్వ మంత్రముల ఫలితమును కలిగించు జనని సర్వమంత్రఫలప్రద.

తే.గీ.  *సర్వ మంత్రఫలప్రదా!* సన్నుతముగ

నిన్ను సేవించు భక్తుల నెన్ని నీవు

సర్వమంత్రఫలంబులన్ సరగున నిడి

కాచి రక్షించుచుందువో కమల నయన!

 

101  ఓం *దారిద్ర్యధ్వంసిన్యై* నమః ౧౦౦

నామ వివరణ.

తనను నమ్మి భజించు సాధకుల దరిద్రమును రూపుమాపు తల్లి

దారిద్ర్యధ్వంసినీ మాత.

కంచేరుచు నిను నిజ భక్తులు

కోరుచు భజియింప, వారు కోరకముందే

దారిద్ర్యమణచి తీర్తువు,

*దారిద్ర్యధ్వంసినీ!* ముదంబున కోర్కెల్.

ఓం *దేవ్యై* నమః

కం.  *దేవీ!* నీ శుభ తేజము

భావింపగనైన నాకు వశమా జననీ?

సేవాదృక్పథమిమ్మా,

సేవించెద నిన్ను సతము క్షేమంబొందన్.

102. ఓం *హృదయగ్రన్థిభేదిన్యై* నమః

నామ వివరణ.

హృదయగ్రంధిని భేదించు జనయిత్రి హృదయగ్రంధి భేదిని.

తే.గీసాధకుని చిత్తమరయుచు సాధనమున

సత్ఫలంబులు కొల్పెడి సౌమ్యవీవు,

సాధనము చేయ నేర, నన్ సాకుము  విను

  *హృదయగ్రన్థిభేదినీ!* తప్పదమ్మ.

జైహింద్.


 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.