గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఆగస్టు 2024, బుధవారం

నారాయణం నమస్కృత్య ... మేలిమిబంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

శ్లో.  నారాయణం నమస్కృత్య  -  నరం చైవ నరోత్తమం ।

దేవీం సరస్వతీం వ్యాసం -  తతో జయముదీరయేత్ ॥

తే.గీ.  నతులు నారాయణునకును, నతులితముగ

నరులలోనుత్తముండైన నరునికి నిక

వాణికిన్ వ్యాసునకుఁ జేసి, పలుకవలెను

పరమ పౌరాణికుల్ జయమరసి మొదటె.

భావము.  నారాయణునికి, నరునికి, నరులలో ఉత్తమునికి, సరస్వతిదేవికి, 

వ్యాసుడికి నమస్కరించి జయమును (పురాణకథనమును) చెప్పాలి. 

(ప్రతి పురాణం ప్రారంభంలో ఈ శ్లోకం చెప్పటం పరంపర.)

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.