జైశ్రీరామ్.
శ్లో. హరణం చ పరస్వానాం - పరదారాభిమర్శనమ్ |
సుహృదశ్చ పరిత్యాగః - త్రయో దోషాః క్షయావహాః ||
(మహాభారతం)
కం. ఇతరుల సొమ్మును దోచుట,
యితరుల స్త్రీలను చెరచుట, యెంచక మంచిన్
నుతుఁడగు మిత్రుని విడుచుట,
క్షితిపైన వినాశ మొసగు, కీడును గొలుపున్.
భావము. ఇతరుల ఆస్తిని అపహరించడం, ఇతరుల భార్యలను చెరచడం,
స్నేహితులను విడిచిపెట్టడం - ఇవి మూడు పూర్తిగా నాశనం చేసే దోషాలు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.