జైశ్రీరామ్.
శ్లో. మనస్యేకం వచస్యేకం - కర్మణ్యేకం మహాత్మనః,
మనస్యన్యత్ వచస్యన్యత్క - ర్మణ్యన్యత్ దురాత్మనః.
తే.గీ. ఆత్మ నున్నదె చెప్పుచు నదియెచేయు,
మహి మహాత్ములు, దుహష్టుల స్పృహయె వేరు.
చింత చేయునదొక్కటి చెప్పి చేయు
నవి కనగ వేరువేరగునరసిచూడ.
భావము.
మహాత్ములు ఏది తలచుదురో అదియే చెప్పుదురు. ఆ చెప్పినదే చేయుదురు.
దురాత్ములు ఆ విధముగా కాదు. వీరు తలచునది ఒకటి, చెప్పునదొకటి,
చేయునది వేరొకటి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.