జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
తే.గీ. ధరణిఁ బడ్డ పాదములకు ధరణియేను
చూడనాధారమమ్మరో! శోభనాంగి!
నీదు సృష్టిలో దోషులన్
నీవె కాచి
శరణమొసగంగవలెనమ్మ! శరణు శరణు.
భావము.
భూమిపై పడిన పాదములకు భూమియే ఆధారము. అటులనే నీ సృష్టిలో
ఉన్న దోషులను నీవే కాపాడి శరణమొసగవలెనమ్మా! నీవే నాకు శరణు.
శా.
అమ్మా!
నీ వర శక్తిఁ గల్గుటనె చేయంగల్గు నీ సృష్టి తా
నెమ్మిన్,
గల్గని నాడహో,
కదలగానే లేడుగా సాంబుఁ డో
యమ్మా!
శంభుఁడు,
బ్రహ్మయున్,
హరియు నిన్నర్చించ
వెల్గొందు ని
న్నిమ్మేనన్ దగ నెట్లు గొల్చెదరిలన్
హీనంపుపుణ్యుల్, సతీ!. ॥ 1॥
భావము.
అమ్మా!
శివుడు
శక్తితో (నీతో) కూడినప్పుడు
జగన్నిర్మాణము
చేయగలుగుతున్నాడు.
కానిచో
స్పందించుటకు
కూడా
అసమర్థుడు
కదా.
బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల చేత ఆరాధించబడు నీకు,
పుణ్యసంపదలేనివాడు
నమస్కరించుట,
స్తుతించుట
ఎలా
చేయగలడు ?
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.