గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఆగస్టు 2024, శనివారం

8వ పద్యము. శ్రీమన్నారాయణ శతకము. గానము. శ్రీమతి దోర్బల బాలసుజాత.

జైశ్రీరామ్.

8. శా. మున్నే నిన్ను మనమ్మునన్ మననమున్ మున్నుంచి మన్నించు నీ

నన్నున్, నా నిను నెన్నునాన్నను ననూనా! మున్నె మన్నించు నో

కన్నా! రక్షకు డీవె కాదె. మనమున్ గాంచన్ మహోదార! శ్రీ

మన్నారాయణ! కావుమయ్య.  జగతిన్ మంచిన్ గృపన్ గావుమా. !

భావము.

పరిపూర్ణుఁడవైన శ్రీమన్నారాయణాఇతః పూర్వమే నిన్ను మనసులో 

ముందుగా నిలిపిమన్నించు నీవాడినైన నన్ను, నాకు సంబంధించిన నిన్ను 

గుర్తించెడి నా యొక్క అన్ననుముందుగానే మన్నించునటువంటి నీకన్నా

రక్షకులింకెవరు? మనసుపెట్టి చూచెడి మహోదారగుణసంపన్నుఁడా

కాపాడుము. లోకమున మంచిని కృపతో కాపాడుము.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.