జైశ్రీరామ్.
శ్లో. ఉభయోర్నాస్తి భోగేచ్ఛా - పరార్థం ధనసంచయః |
కృపణోదారయోః పశ్య - తథాపి మహదంతరమ్ || (సుభాషితసుధానిధి)
కం. కృపణుఁ డుదారుఁడు నిరువురుఁ
దపియింపరు భోగములకు, ధనముగడింపన్
దపియింతురు, పర వశమౌ
స్వ, పరార్థంబుగఁ గల నిధి, సామ్యము కలదే?
భావము. పిసినారి మరియు ఉదారి ఈ ఇద్దరూ తాము అనుభవించాలనే కోరిక
కలిగి ఉండరు; ఇద్దరూ ఇతరులకోసం డబ్బు కూడబెట్టడానికే పనిచేస్తారు.
అయినప్పటికీ, వీరిద్దరి మధ్య అపారమైన తేడా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.