జైశ్రీరామ్.
శ్లో. ఆకారైరింగితైర్గత్యా - చేష్టయా భాషణేన చ l
నేత్రవక్త్రవికారైశ్చ - లక్ష్యతేఽన్తర్గతం మనః ll
తే.గీ. వ్యక్తమగునట్టి యింగితం బాకృతియును,
భాషణము, చేష్ట, మనదైన వ్యవహృతియును,
కనుల ముఖమున గనఁబడు కవళికలును
తెలుపు మనలోని భావనల్ తెల్లమవగ.
భావము. ఆకారముచేత, ఇంగితముచేత, నడవడికచేత, వ్యవహారముచేత,
మాటలచేత మరియు కళ్ళలో, ముఖములో కలిగే మార్పులచేత
మనస్సులోని భావం తెలియజేయబడును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.