గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 3వ శ్లోకం. 13 - 20. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్రీలక్ష్మీసహస్రనామావలిః

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం. శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.


శ్లోఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ

హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ 3

13. ఓం *ఈశావాస్యాయై* నమః

నామ వివరణ.

అంతటనూ తానై యున్న తల్లి లక్ష్మీ మాత.

శా*ఈశావాస్య! * జయోzస్తు తే, యనుచు నిన్నే కొల్తురోయమ్మ!

ద్ధీశాలాగ్రణు లెల్లవేళలనుస్వాధీ నాత్ములై ధాత్రి, వా

గీశానీ నుత సత్ స్వరూపిణివి దేవీలోకమందంతటన్

నీ శక్తిన్ గను నేర్పునిమ్ము కృపతో నిత్యంబు నిన్ గొల్చెదన్.

14. ఓం *మహామాయాయై* నమః

నామ వివరణ.

అష్ట లక్ష్మీ స్వరూపిణియైన జనని గొప్ప మాయా స్వరూపిణి.

శామాయామోహములన్ జయింపనయితిన్ మాయన్ ద్యజించన్   *మహా

మాయా!* నీ పదపద్మముల్ కొలిచెదన్ మాయన్ విడన్ జేయుమా,

నీ యాజ్ఞన్ శిరసావహించి నడచున్ నీ సృష్టి సర్వంబు, నీ

మాయన్ బాపుట నీకు లెక్కయగునా? మాతల్లివే, పాపుమా.

15. ఓం *మహాదేవ్యై* నమః

నామ వివరణ.

గొప్ప దేవత జహన్మాతయైన లక్ష్మీ మాత.

కంభావాతీతవుగ *మహా

దేవీ!* మద్భాగ్యలబ్ధ దీపిత వీవే

కావక యున్నను నాకిక

నేవారలు ప్రోవఁగల రహీన దయాబ్ధీ!

16. ఓం *మహేశ్వర్యై* నమః

నామ వివరణ.

గొప్ప ప్రభ్విణి మన లక్ష్మీ మాత. మహేశ్వరుని అర్థాంగలక్ష్మి మహేశ్వరి.

కంనీ యనుఁగు భక్తుల కిలను

శ్రేయములిడు శ్రీ *మహేశ్వరీ!* నినుఁ గొలుతున్.

నాయందు కృపను నిలువుము

మాయను పోకార్పి కావ, మహిలో జననీ!

17. ఓం *హృల్లేఖాయై* నమః

నామ వివరణ.

హృదయమును తాకు జనని. హ్రీమ్ అనే అక్షరంలో ఉన్న జనని. 
కం.  *హృల్లేఖా!* నా మదిలో
కల్లోలములణచివేసి కారుణ్యముతోఁ
జల్లగ కావుము నన్నున్!
దల్లిగ నీ కృపను జూపి ధైర్యమునిమ్మా.

18. ఓం *పరమాయై* నమః

నామ వివరణ.

లక్ష్మీమాత గొప్పదైన తల్లి.

కం*పరమా* నిన్నే కొలిచెద

పరమార్థమునెన్ని నేను ప్రఖ్యాతముగా,

నిరుపమ సద్గుణ గణ్యా!

వరదాయిని వీవె నీ ప్రభావము నెంతున్.

 

19. ఓం *శక్త్యై* నమః

నామ వివరణ.

అమ్మ శక్తి స్వరూపణి.

తే.గీశక్తివోయమ్మ శ్రీ పరా! *శక్తి! * నీవు

ముక్తి భాగ్యప్రదాయివి! పూజ్య దేవి!

యుక్తమైనట్టివిమ్ము నాకొప్పిదముగ,

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *పరమాయై శక్త్యై* నమః.
 

నామ వివరణ.

గొప్ప శక్తి స్వరూపిణి మన  లక్ష్ని మాత.

కం. ననుఁ గను *పరమా! శక్తీ! *

నిను నామది నిలిపి సతము నిన్నే కొలుతున్,

కనిపించు కంటికెదురుగ

వినయంబుగఁ బ్రణుతులిడుదుఁ, బ్రీతిగ జననీ!

కంఅమ్మా! *పరమా శక్తీ!*

సమ్మోదము తోడ నాదు సంస్తుతి  వినుమా,

నెమ్మదిఁ బరమాశక్తిగ

నిమ్మది నివసింపుమో యహీన దయాబ్ధీ!

20. ఓం *మాతృకాబీజరూపిణ్యై* నమః

నామ వివరణ.

మాతృకా వర్ణస్వరూపిణి మన అమ్మ.

తే.గీ.  *మాతృకాబీజరూపిణీ!* మహితమయిన

మాతృకా వర్ణమయముగా మదిని నిలిచి

పద్యసంస్తుతులందీవు పరిఢవిల్లి

సంతసంబును గొలుపుమా చదువరులకు.

జైహింద్.






Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.