గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 10వ శ్లోకం. 70 - 76. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

 శ్రీలక్ష్మీసహస్రనామావలిః 

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం. శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.


శ్లోఅరూపా బహురూపా విరూపా విశ్వరూపిణీ

పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా 10  

70. ఓం *అరూపా*యై నమః

నామ వివరణ.

రూప రహిత అరూప మన అమ్మ.

తే.గీరూపమెన్నగ లేని *యరూప!* జనని!,

నిన్ను నిర్గుణ తత్వమంచెన్నవలయు,

మానసమ్మున నిను దల్వ మధురమగును

పూర్ణమైన స్వరూపిణీ! స్వర్ణమయమె.

71. ఓం *బహురూపా*యై నమః

నామ వివరణ.

అమ్మ అన్నిరూపములలోను విరాజిల్లుచున్నందున ఆమె బహురూపిణి.

కం.  *బహురూపా!* నీ యునికిని

బహురూపములలరుచుండె ప్రఖ్యాతముగా

నిహపర సాధకమార్గము

బహురూపా నీవె కాదె? భావనఁ జేయన్.

72. ఓం *విరూపా*యై నమః

నామ వివరణ.

ముక్కంటి విరూపవిశిష్ఠనయిన రూపము కలది అమ్మ.

కంపరమాద్భుతదర్శనమిడు

*విరూప!* కృపతో కనఁబడు! విశ్వంభరవే

తరమా గాంచుట నిన్ మది?

పరమేశ్వరి! కృపను గనుము ప్రఖ్యాతముగా.

73. ఓం *విశ్వరూపిణ్యై* నమః

నామ వివరణ.

అమ్మ విశ్వమే తన రూపముగా కలది.

తే.గీ.  *విశ్వ రూపిణీ!* కాదిల శాశ్వతమ్మ

దేదియున్ జూడనీదగు పాద పద్మ

ములె కనంగను ముక్తిదములు నిజంబు,

కొమ్ము నా సేవ పాదమ్ములిమ్ము కొలుతు..

74. ఓం *పఞ్చభూతాత్మికా*యై నమః

నామ వివరణ.

అమ్మ పంచభూత స్వరూపిణి.

తే.గీ.  *పఞ్చభూతాత్మికా* యీ ప్రపంచమెన్న

నీదు రూపంబె, యన్నిటన్ నీవె కలవు,

పఞ్చభూతంబులీవేను, భద్రమీవె

భక్తి నినుఁ గొల్తు కను నన్ను ముక్తిదవయి.

75. ఓం *వాణ్యై* నమః

నామ వివరణ.

వాగ్రూపిణి అయిన అమ్మ వాణియే.

తే.గీవాక్సుధాస్రవంతిగ నోట వరల రమ్ము,

జ్ఞాన సద్భాగ్యదా! *వాణి!* కరుణఁ గనుము,

ప్రాణమీవేను నాలోని జ్ఞానమీవె,

వందనమ్ములు గొనుమమ్మ  బ్రహ్మరాణి!

76. ఓం *పంచ భూతాత్మికా పరా*యై నమః

నామ వివరణ.

భౌతిక ప్రపంచమే రూపముగా కల పరా స్వరూపిణి మన తల్లి.

తే.గీ*పంచ భూతాత్మికాపరా!* సంచిత ఫల

మగుచు లభియించి తీవు నా కనుపమముగ

నీదుపాదాబ్జములఁబట్టి నేను విడువ

ముక్తిసామ్రాజ్యదాయినీ! శక్తినిమ్ము.  జైహింద్.

ఓం * పంచ భూతాత్మికా *యై నమః

నామ వివరణ.

భౌతిక ప్రపంచమే రూపముగా కల తల్లి.

తే.గీ.  *పంచ భూతాత్మికా!* నీ ప్రపంచమందు

నేను జన్మించియుంటిని, నీదు సేవఁ

జేయు భాగ్యమ్ము కల్పించి చేదుకొమ్ము,

నీవు కాదన్న దిక్కేది? నీరజాక్షి!

ఓం *పరా*యై నమః

నామ వివరణ.

పరాశక్తి స్వరూపిణి అమ్మ

తే.గీ *పరా!* నీదు పదసేవ నొప్పు బ్రతుకు

బ్రతుకనంబడు, కానిచో బ్రతుకు కాదు,

పరము నందంగఁ జేయు నీ పదయుగళము,

నాదు భక్తిలో నిలిచి నన్నాదుకొనుము.

ఓం *పరమాత్మికా*యై నమః

తే.గీ. వినుత *పరమాత్మికా! * నీవు ప్రేమతోడ

నీదు వేయి నామంబులన్ నేర్పు మీర

పద్యములలోన పొదిగించి, పది దినముల

లోన వ్రాయించనుంటివా? జ్ఞాన భాస

జైహింద్.
 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.