గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఆగస్టు 2024, మంగళవారం

ఆంజనేయ దండక గర్భస్థ సీసము. రచన. .. చింతా రామకృష్ణారావు.

 జైశ్రీరామ్.

🙏🏼

ఆంజనేయ దండక గర్భస్థ సీసము.

👇🏼

శ్రీయాంజనేయా! విశేషప్రభావా! నినున్ నమ్మితిన్ గాంచు నన్ను నీవు,

నీతోడు నాకున్న నే రామునిన్ గొల్చి నిత్యత్వమున్ బొంది నిశ్చయముగ,

శ్రీరామ భక్తిన్ ప్రసిద్ధంబటంచున్ రచింతున్ కవిత్వంబు చిత్రగతిని,

శ్రీరాముఁడున్ సీత చిత్తంబునందుండ నేరంబులన్ జేయ నేరనేను,

తే.గీ.  భక్తి యన్నను నీదయ్య భజన జరుగు

చోటులందుందువెప్పుడున్ జొక్కి యచట,

నీదు కృపఁ జూపి నాపైన నిర్మమగు

భక్తినే గొల్పు నాలోన, ముక్తినిడగ.

🙏🏼

సీసమునందలి దండకము.

👇🏼

శ్రీయాంజనేయా! విశేషప్రభావా! నినున్ నమ్మితిన్ గాంచు, నీతోడు నాకున్న 

నే రామునిన్ గొల్చి నిత్యత్వమున్ బొంది శ్రీరామ భక్తిన్ ప్రసిద్ధంబటంచున్ 

రచింతున్ కవిత్వంబు, శ్రీరాముఁడున్ సీత చిత్తంబునందుండ 

నేరంబులన్ జేయ నేరనే. 

🙏🏼

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.