జైశ్రీరామ్.
శ్లో. వనేఽపి దోషాః ప్రభవన్తి రాగిణాం - గృహేఽపి పఞ్చేన్ద్రియనిగ్రహస్తపః।
అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే - నివృత్తరాగస్య గృహం తపోవనమ్॥
(హితోపదేశః)
తే.గీ. రాగునకు వనమందునన్ గ్రాలు నవియె,
యింద్రియ జితుడింటఁ దపసియె, గణియింప
కుత్సితపు కర్మ దూరునకును విరాగు
నకు దపోవనమిల్లెయౌ సకలవేద్య!
భావము. విషయవాసనలు కలవారికి అడవికి వెళ్లినా కామక్రోధాదిదోషాలు
సంభవిస్తాయి. పంచేంద్రియాలను నిగ్రహించినవారు ఇంటిలో ఉన్నా తపస్సు
చేయగలరు. అనగా వారు తాపసులే. శాస్త్రముచే నిందింపబడని
(శాస్త్రసమ్మతములైన) కర్మలు ఆచరిస్తూ విషయవాంఛలు వదిలి చరించేవారికి
ఇల్లే తపోవనము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.