గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఆగస్టు 2024, శుక్రవారం

యథా చిత్తం తథా వాచ: .. మేలిమిబంగరం మన సంస్కృతి.

 జైశ్రీరామ్

శ్లో.  యథా చిత్తం తథా వాచ:  -  యథా వాచస్తథా క్రియా:l

చిత్తే వాచ క్రియాయాం చ   -  సాధూనామేక రూపతాll 

తే.గీ.  మనసునెటులుండునటులుండు మాటకూడ,

మాటలెటులుండు పనులును మాటలటులె

యుండు త్రుకరణ శుద్ధిగా ననుపమముగ,

సరస జీవన మార్గపు సరళి యదియె.

భావము. మనస్సున్నట్టు మాటలు, మాటల్లానే చేతలు.. మనస్సు, మాట, 

చేతల్లో మంచివారు ఏ కాలంలోనైనా ఒకే రకంగా ఉంటారు. అనగా 

త్రికరణశుద్ధిని కలిగి ఉంటారు.

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.