జైశ్రీరామ్.
నేనిచ్చిన సమస్య.
పృచ్ఛకపాళినే కనుచు వృశ్చికపాళి యనెన్ వధానియే.
అవధాని పూరణ.
ఉ. స్వచ్ఛమరందధారలను పారఁగ జేయరె ప్రాశ్నొకోత్తముల్,
సచ్ఛవిఁ గూర్చు ప్రశ్నలను శక్తికి సానను బట్టువారలే,
తుచ్ఛములే ప్రలాపములదోషవచస్సుల కాలకంసు లే
పృచ్ఛకపాళినే కనుచు వృశ్చికపాళి యనెన్ వధానియే.
నేనిచ్చిన దత్తపది
కృష్ణం
వందే
జగద్
గురుమ్
అనే పదాలు చేర్చి శ్రీశైలేశుని స్తుతి.
అవధాని పూరణము.
కం. వందే యటంచు సుమనో
బృందములాకృష్ణములయి కృష్ణమనమునన్
స్పందితుఁడా గురుమల్లన
అందర రక్షించును జగదానందముగా.
దీనికినా పూరణ.
శా. శ్రీశైలేశ! దయానిధీ! పశుపతీ! *కృష్ణమ్* మ నీ ప్రక్కనే
భాసించున్ గద ఘోష సేయుచును తా *వందే* యటంచున్ సదా,
ధీశా! నీవె *జగద్* ధితుండ వనుచున్ దీవింతువంచున్ జనుల్
ధ్యాసన్ వచ్చిరి, యో *గురుం* డ! దయతో నాశీస్సులందింపుమా.
నేనిచ్చిన వర్ణనాంశము.
శ్రావణ శుక్రవారమున పేరటాండ్రు భక్తిపారవశ్యం శార్దూలవృత్తములో.
అవధాని పూరణ.
శా. శ్రీమన్మంగళ క్షీరవార్ధి తనయా శ్రీసేవనా తత్పరుల్,
సీమాహీన విశుద్ధ త్త్వమతులై జీవంబు ధన్యంబుగాన్,
రామల్ గౌరిని యేక కాలమున సంప్ర్స్స్ర్థింప రక్షింపగన్
గీమున్, సంతులు, భర్తలంచుమదిలో గీరర్చనల్ చేయరే.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.