జైశ్రీరామ్.
శ్లో. స్వభావేన హి తుష్యంతి - దేవాః సత్పరుషాః పితా |
జ్ఞాతయస్త్వన్నపానేన - వాక్యదానేన పండితాః ||
తే.గీ. సత్స్వభావాన కనుదురు సంతసమును
దేవ, పితరులు, సజ్జనుల్, దివ్యమైన
భోజనమునను బంధువుల్ సాజముగనె,
పండితులు మంచిమాటకే పరవశింత్రు.
భావము. మంచి స్వభావంచేత దేవతలు, సజ్జనులు, తండ్రి - వీరు సంతృప్తి
చెందుతారు. బంధుబాంధవులు అన్నపానాలతో సంతుష్టులౌతారు.
విద్వాంసులైతే చక్కని మాటలతోనే ఆనందపడతారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.