కైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
సీ.
నీకంటెనన్యులౌ
నిఖిలదేవతలెన్న నభయముద్రను గల్గి యలరుదురిల,
శ్రీద! వరాభయచిహ్నముల్ ప్రకటితముద్రల నభినయము గల తల్లి
వీవేను ముఖ్యమౌ యీశ్వరీ!
సృష్టిలో
కారణమొకటుండె కనగ నిజము,
కోరకముందేను కోరికలను దీర్చి నీ పాదముల్ భీతినే దహించు,
తే.గీ.
అట్టి నీ
పాదములు నేను పట్టనుంటి,
శరణు కోరుచు, మాయమ్మ! శరణమిమ్మ.
రామకృష్ణుని కవితలో ప్రాణమగుచు
వెలుఁగు మాయమ్మ! నిన్ను నే విడువనమ్మ! ॥ 4 ॥
భావము.
అమ్మా! లోకములకు దిక్కు అయిన తల్లీ! మిగిలిన దేవతలు అందరూ అభయ ముద్రలను కలిగి ఉన్నారు. అందరు దేవతలకు ముఖ్యమయిన నీవు మాత్రము వరాభయ గుర్తులు అయిన ప్రకటిత ముద్రల అభినయము కల దానవు. అయితే కోరక ముందే నీ పాదములు కోరికలు తీర్చి, భయములు పోగొట్టును కదా !
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.