గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2025, బుధవారం

శంకరభగవత్పాదకృత ....అ కారాది క్షకార ... సువర్ణమాలాస్తుతికి ఆంధ్రపద్యానువాదము. రచన ... చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.

 శంకరభగవత్పాదకృత ....అ కారాది క్షకార ... సువర్ణమాలాస్తుతికి 

ఆంధ్రపద్యానువాదము.


శ్లో.  అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ ||౧||

తే.గీ.  అభవ! నీగుణ స్తుతిని జిహ్వను విశుద్ధి

చేసుకొందును పరమేశ! ధ్యాస నిలిపి,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఆఖణ్డలమదఖణ్డనపణ్డిత తణ్డుప్రియ చణ్డీశ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్ || ౨||

తే.గీ.  ఆత్మభవ! యింద్రు గర్వమునణచు నిపుణ!

జయద! చండీశ! నందికేశప్రియ హర!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఇభచర్మాంబర శంబరరిపువపురపహరణోజ్జవలనయన విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౩||

తే.గీ.  ఇభవపుర్వస్త్ర! భస్మ దేహిగ మదనుని

చేసినట్టి యుజ్వల నేత్ర! భాసురుండ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయభూషణ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౪||

తే.గీ.  ఈశ్వరా! గిరీశ! మహేశ! హృది పరేశ! 

వర బిలేశయ సువిభూష! భవుఁడ! నతులు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఉమయా దివ్యసుమఙ్గళవిగ్రహయాలిఙ్గితవామాఙ్గ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౫||

తే.గీ.  ఉమ సుమంగళాంగాలింగితోత్తమంపు 

వామ శోభితాంగా! హరా! భక్తవరద!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ఊరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౬||

తే.గీ.   ఊర్ధ్వరేతస! అజ్ఞునన్నోపి నాదు 

దురితములు పారఁద్రోలుమా! పరమ పురుష!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ఋషివరమానసహంస చరాచరజననస్థితికారణ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౭||

తే.గీ.  ఋషివర హృదయ హంస! ధాత్రిని చరాచ

రములకును హేతువై వెల్గు ప్రముఖ! భవుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ౠక్షాధీశకిరీట మహోక్షారూఢ విధృతరుద్రాక్ష విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౮||

తే.గీ.  ౠఘ్న! ఋక్షాధిప కిరీట! ధృత చతుర్ద

శ భువనుండ! పరాత్పరా! శంకరుండ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!

(ౠ = రాక్షసుఁడు)


శ్లో.  ఌవర్ణద్వన్ద్వమవృన్తసుకుసుమమివాఙ్ఘ్రౌ  తవార్పయామి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౯||

తే.గీ.  ఌప్రదా! నేత్రపుష్పముల్ సుప్రసిద్ధ

ముగను నీపాదములకిత్తు పొంగుచు మది,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ఏకం సదితి శ్రుత్యా త్వమేవ సదసీత్యుపాస్మహే మృడ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౦||

తే.గీ.  ఏల నన్యముల్?  సత్తత్త్వ మీవె యనుచు

నిన్నుపాసింతు నిత్యంబు నీలకంఠ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఐక్యం నిజభక్తేభ్యో వితరసి విశ్వంభరోఽత్ర సాక్షీ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౧౧||

తే.గీ.  ఐతివీవేమహాసాక్షివన్నిటికిని,

ఐక్యమైభక్తులనుగూడి యలరు దేవ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఓమితి తవ నిర్దేష్ట్రీ మాయాఽస్మాకం మృడోపకర్త్రీ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౨||

తే.గీ.  ఓ శుభంకర! ప్రణవమే యుత్తమముగ

నిన్నునెఱుఁగఁజేయఁగజాలు, నిర్వికార!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఔదాస్యం స్ఫుటయతి విషయేషు దిగమ్బరతా చ తవైవ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౩||

తే.గీ.  ఔను, నీవు దిగంబరుండనగమనుట

నీ యుదాసీనతన్ దెల్పు నిఖిలమునను,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   అంతః కరణవిశుద్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౪||

తే.గీ.  అంగజాంతక! నా యంతరాత్మశుద్ధి,

భక్తి, నీసతి యొసఁగుత వరల నాకు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   అస్తోపాధిసమస్తవ్యస్తై రూపైర్జగన్మయోఽసి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౫||

తే.గీ.  అః! సమిష్టిగా నొంటిగా, నలరుదీవు,

జగతి నంతటన్ శుభములన్ సతము కలిగి,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!  (అః = శంకరుఁడా!)


శ్లో.   కరుణావరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో న హి భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౬||

తే.గీ.  కరుణకాలయ! నాపైనఁ గరుణఁ జూప 

ధరణి పయినుదాసీనత తగదు నీకు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఖలసహవాసం విఘటయ సతామేవ సఙ్గమనిశం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౧౭||

తే.గీ.  ఖలుల సహవాసమును బాపి కావుము భవ!

సజ్జనులతోడి సంగతి సలుపనిమ్ము,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   గరళం జగదుపకృతయే గిలితం భవతా సమోఽస్తి కోఽత్ర విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౧౮||

తే.గీ.  గరళమునుత్రాగితివి నీవు కావ జగతి

నీకు సాటెవ్వరుందురో నీలకంఠ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ఘనసారగౌరగాత్ర ప్రచురజటాజూటబద్ధగఙ్గ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౧౯||

తే.గీ. ఘన సుఘనసార గౌరవ గాత్ర! సాంబ!

గంగనే శిఖ లోపలఁ గట్టిన హర!,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   జ్ఞప్తిః సర్వశరీరేష్వఖణ్డితా యా  విభాతి సా త్వయి భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౦||

తే.గీ. ఙ నెడఁ బాపుమా యంతటం గలుగువాఁడ!

జ్ఞానమీవౌదువెంచగా కల్మష హర!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!  (ఙ = విషయేచ్)


శ్లో.   చపలం మమ హృదయకపిం విషయదుచరం దృఢంబధాన విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౨౧||

తే.గీ. చపలమైనట్టి నా చిత్త కపిని భవుఁడ!

నీవు బంధించి నిలుపుము నిర్వికల్ప!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఛాయా  స్థాణోరపి తవ తాపం నమతాం హరత్యహో శివ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౨౨||

తే.గీ. ఛాయనిచ్చెడి స్థాణువు చక్కగ నిను

కొలుచు వారి భవాంధమున్ దొలఁగఁ జేయు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  జయ కైలాసనివాస ప్రమథగణాధీశ భూసురార్చిత భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౩||

తే.గీ.   జయము కైలాస వాస విజయము నీకు,

భూసురాళి ప్రమదపాళి పూజిత శివ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ఝణుతకఝఙ్కిణుఝణుతత్కిటతకశబ్దైర్నటసి మహానట భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౨౪||

తే.గీ.   ఝణుత ఝణత్ కఝఙ్కిణుఝణుత కిటత,

శబ్దములతోడనటియించు సాంబుఁడవయ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   జ్ఞానం విక్షేపావృతిరహితం కురు మే గురుస్త్వమేవ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౨౫||

తే.గీ.   ఞ నధిరోహించి వెలుగెడి జ్ఞాన రూప!

గురువువై బోధ కలిగించి కొలుపు ముక్తి.

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!  (ఞ = ఎద్దు)


శ్లో.   టఙ్కారస్తవ ధనుషో  దలయతి హృదయం ద్విషామశనిరివ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౬||

తే.గీ.   టఙ్కృతిధ్వని నీవిల్లుటమ్ములును త్రి

శూలముల్ జేయ రిపులెల్ల తూలినారు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ఠాకృతిరివ తవ మాయా బహిరన్తః శూన్యరూపిణీ ఖలు భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౭||

తే.గీ.   ఠ! జగదీశ్వర! కన బయటను మరియును

లోన శూన్య రూపిణి మాయ, కాననగునె?

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ! (ఠ = ఓ శివుఁడా!)


శ్లో.   డమ్బ రమంబురుహామపి దలయత్యనఘం త్వదఙ్ఘ్రియుగళం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౮||

తే.గీ.   డప్పు మ్రోగించి చెప్పెద డంబ రహిత!

నీ పదారుణిమకు లొంగి నిలుచు తమ్మి,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ఢక్కాక్షసూత్రశూలద్రుహిణకరోటీసముల్లసత్కర భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౨౯||

తే.గీ.   ఢక్క,  శూలాక్షసూత్రముల్, చక్కనయిన

చేతినల బ్రహ్మ పుర్రెయు చెలఁగు నీకు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ణాకారగర్భిణీ చేచ్ఛుభదా తే శరణగతిర్నృణామిహ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౦||

తే.గీ.   ణాకృతిగ పొది నీదు బాణమ్ములున్న

ప్రజల మేలునకైయుండు పరమశివుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ! (ణాకృతిగ = కృపతో కూడిన ఆకారముతో)


శ్లో.   తవ మన్వతిసఞ్జపతః సద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౩౧

తే.గీ.  తలచి జపియింప నెవ్వడేన్ ధరణిపైన 

నీదుమంత్రంబు, వానికిన్  లేదు భవము,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


 శ్లో.  థూత్కారస్తస్య ముఖే భూయాత్తే నామ నాస్తి యస్య విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౨||

తే.గీ.  థనదిరోహణన్ నినుఁ గాంతు దాతిఁ కనఁగ

నిన్నుతలవని ధూర్తుని నెన్న నీకు,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ! (థ ను = కొండ ను)


శ్లో.   దయనీయశ్చ దయాళుః కోఽస్తి మదన్యస్త్వదన్య ఇహ వద భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౩౩||

తే.గీ.  దయకు  నేతప్ప ప్రార్థింప ధరణి  కలరె?

నీవుకాకదయనుచూప దేవులేరి దైవమేది?

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ధర్మస్థాపనదక్ష త్ర్యక్ష గురో దక్షయజ్ఞశిక్షక భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౩౪||

తే.గీ.  ధర్మ సంస్థా పనా దక్ష! త్ర్యక్ష! దక్ష

యజ్ఞ విధ్వందకా! గురుఁడ! యమరవినుత!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   నను తాడీతోఽసి ధనుషా లుబ్ధధియా త్వం పురా నరేణ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౫||

తే.గీ.  నరుఁడు లక్ష్యంబుతో నినున్ బరమశివుఁడ!

ధనువుతోఁ గొట్టె, పాపంబు తలపలేదు.

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   పరిమాతుం తవ మూర్తిం నాలమజస్తత్పరాత్పరోఽసి విభో|

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౬||

తే.గీ.  పరమపురుషుండు విష్ణువు, బ్రహ్మకూడ

నిన్నుఁ గొలువంగనందవు నిరుపమాన!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   ఫలమిహ నృతయా జనుషస్త్వత్పదసేవా సనాతనేశ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౭||

తే.గీ.  ఫలము మానవ జన్మకు ప్రభువువైన

నీదుపాద సంసేవయే నిరుపమాన!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  బలమారోగ్యం చాయుస్త్వద్గుణరుచితాం చిరం ప్రదేహి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౮||

తే.గీ.  బలమునాయువునారోగ్య వర్ధనంబు, 

నీదుగుణగణశక్తియు, బోధనిమ్ము,

 శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   భగవన్ భర్గ భయాపహ భూతపతే భూతిభూషితాఙ్గ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౩౯||

తే.గీ.  భర్గ!  భగవన్! భయాపహా! భస్మ భూషి

తాంగ! భూతపతీ! నమ స్సాంబ! శివుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   మహిమా తవ నహి మాతి శ్రుతిషు హిమానీధరాత్మజాధవ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౦||

తే.గీ.  మహిమ నీదెన్నఁ సరిపోవు సహనమూర్తి!

వేదములు హైమపతిదేవ!  విశ్వభాస!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   యమనియమాదిభిరఙ్గైర్యమినో హృదయే భజన్తి స త్వం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౧||

తే.గీ.  యమము నియమము మున్నగు నఖిలసిద్ధు

లను నినున్ యోగులాత్మలన్ గనుదురయ్య!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  రజ్జావహిరివ శుక్తౌ రజతమివ త్వయి జగన్తి భాన్తి విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౨||

తే.గీ.  రజ్జుసర్పంబు నాన్ శుక్తి రజత మట్లు 

ప్రబలు లోకముల్ నీలోన, భ్రమయె చూ

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   లబ్ధ్వా భవత్ప్రసాదాచ్చక్రం విధురవతి లోకమఖిలం భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౩||  

తే.గీ.  లబ్ధమయ్యెను చక్రంబు లక్ష్యమొప్ప

లోకపాలక హరికి నీలోననుండి,

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  వసుధాతద్ధరతచ్ఛయరథమౌర్వీశరపరాకృతాసుర భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౪||  

తే.గీ.  వసుధ, యా శేషుఁ డావిష్ణుఁ డసమ రథము,

విల్లు, బాణమ్ము కాన్, దుష్ట విదరు వయితె?

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  శర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్తగర్వహరణ విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౫||

తే.గీ.  శర్వదేవ! సర్వోత్తమా! సర్వద! శివ!

దురిత, దుర్వృత్త గర్వాపహ! రమణుండ! 

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   షడ్రిపుషడూర్మిషడ్వికారహర సన్ముఖ షణ్ముఖజనక విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౬||

తే.గీ.  షడ్రిపుల, షడూర్మి, నిలను షడ్వికార

ములను హరియించు మహితుండ! పూజ్య శివుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   సత్యం జ్ఞానమనన్తం బ్రహ్మేత్యేతల్లక్షణలక్షిత భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౭||

తే.గీ.  సత్య సుజ్ఞాన సదనంత సర్వ పూర్ణ

బ్రహ్మసుస్వరూపుడవీవు, పరమశివుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   హాహాహూహూముఖసురగాయకగీతపదానవద్య విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౮||

తే.గీ.  హరుఁడ! హాహాల హూహూల నిరుపమాన

గానములనొప్పువాఁడవో గరళ గళుఁడ!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.  ళాదిర్న హి ప్రయోగస్తదన్తమిహ మఙ్గళం సదాఽస్తు విభో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  || ౪౯||

తే.గీ.  ళ పదమాదినుండదుచూడ, లక్ష్యమొప్ప

ళాంత మంగళాంతములుండు, శాంతరూప!

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ!


శ్లో.   క్షణమివ దివసాన్నేష్యతి త్వత్పదసేవాక్షణోత్సుకః శివ భో |

సాంబ సదాశివ శంభో శఙ్కర శరణం మే తవ చరణయుగమ్  ||౫౦||

తే.గీ.  క్షణికమట్టులగడుపునీ కాలమంత

నీదు పాద సంసేవకై నీ సిసువుఁడు.

శరణమగు నాకు నీదైన చరణ యుగము,

సాంబ! శంభో! సదాశివా! శంకరుండ! (సిసువుఁడు = భక్తుఁడు)

శంకరభగవత్పాదకృత సువర్ణమాలాస్తుతికి అమ్మ దయతో

చింతా రామకృష్ణారావు విరచించిన 

ఆంధ్రపద్యానువాదము సంపూర్ణము.

తే. 03 – 03 – 2025.(పూర్వదినాది దినద్వయే విరచితమ్)

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.