జైశ్రీరామ్.
1.కం;-సూతుడు శౌనికుల కనియె!
నీతులు స్వార్ధార్ధ భద్ర నింగిని డాయన్!
మేతయు వశు తుల్యంబవ!
ఘాతుకముల్గల్గు కలిని!కట్డడి వశమే!
2.కం:-శివ నామము తలపోయగ!
భవ బంధ విమోచనంపు భాగ్యం బమరున్!
భవి సుఖ జీవన మలరున్!
నివహంబులు నిండు శోభ!నేర్మిన్ కూర్మిన్!
3.కం:-జాతులు కులములు మతములు
పాతుక పడు పూర్వ విభవ భాగ్యోదయమున్!
నీతిని తత్కుల ప్రాప్తికి
భూత దయం జయ ప్రపూర్ణ పూర్ణత మలరున్!
4.కం:-ఈవియు లేనటి జన్మము
తావకమా!కాదు కాధు!దర్పం బలరున్!
పోవును సిరులవి చరములు
రా వవి వెనువెంట దెలిసి రాజిలు జీవా!
5.ఉ:-ఆలన పాలనం గనక!హాయి నెరుంగని భారతా వనిన్!
చాలని తిండి!దోషచర!సంతతి క్రోధి వికార చేష్టలన్!
నాలుక ప్రేలనం జగము!నాశ వినాశ ప్రకాశ వంతమై!
చేలము లూడ దీసె!మను జీవన దుస్తితి!బాధలంటగన్!
6.ఉ:-క్రోధియు కొంప ముంచె గద!కూరిమి నామడ గానరాకిలన్!
చేదు నిజంబు నెర్గవలె!చింత వికార ఋణాంతకం బయెన్!
కాదన శేషునిం దరమె! గౌరవ కీర్తి ప్ర కీర్తు లారెనే!
ఆదరమొప్ప శ్రీ హరియు!హాయిని గూర్ప మనంబు నెంచి తా!
7.ఉ:-బాలురు వృద్ధులుం మదిని ప్రార్ధిల దైవము నెట్టకేలకున్!
చాలిక పొమ్మనం గదలె!సత్కృప క్రోధి జనాళి గాంచితా!
మేలొనరం గతంపు గతి!మిక్కిలి కీర్తి ఘటింప జేయగన్!
సాలు రమాభి రామమన!చక్కున నూతన సాలు వచ్చెనే!
8 కం:-స్వార్ధము నిండినక్రోధియె!
పార్ధివమై దేశ ప్రగతి భంగుర పరపన్!
పార్ధుని సారధి పంపగ
సార్ధత విశ్వావసువను సాలది వచ్చెన్!
9.కం:-విశ్వావసు వత్సరమును
విశ్వాసము నింపి జగతి విస్తృత ఫణితిన్!
పశ్యంతీతి వసు ప్రదత
దృశ్యంబై!గాచు గాత!దీపిల ధాత్రిన్!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.