జైశ్రీరామ్.
శ్లో. ఉద్వేజనీయో భూతానాం - నృశంసః పాపకర్మకృత్ |
త్రయాణామపి లోకానాం - ఈశ్వరోఽసి న తిష్ఠతి || (రామాయణం)
తే.గీ. ప్రజలకహితంపుకార్యముల్ ప్రబలఁ జేయు
లోక పాలకుఁడల మూడు లోకములకు
ప్రభువెయైనను నిలలేడు, భ్రష్టుపట్టి
నాశనంబగు నాతండు ధీశుఁడైన.
భావము. ప్రజలకు ఉద్వేగాన్ని కలిగించే దుర్మార్గమైన పనులు చేసే ఘాతుకుడు
మూడు లోకాలకు అధిపతిగా ఉన్నా కూడా ఎక్కువ కాలం బ్రతకలేడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.