గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఏప్రిల్ 2025, మంగళవారం

పటువర్ధన్ శతావధానము. సందర్భముగా...తే.12 . 4 . 2025 నుండి 14 . 4 . 2025. వరకు.తెలుఁగు విశ్వవిద్యాలయములో...

 జైశ్రీరామ్.

శా.  శ్రీమన్మంగళ సద్వధానమున మా శ్రీమాత మిమ్మేలుతన్,

ధీమంతా పటువర్ధనా! వెలుగుడీ దేదీప్యమానంబుగా,

మీ మార్గంబు శుభాకరంబగుత, భూమిన్ మీదు సత్కీర్తినే

ధీమంతుల్ కొనియాడగా తనియుఁడీ, ధ్యేయంబునే చేరుడీ!

నిషిద్ధాక్షరిలో నేనిచ్చిన అంశము .
అవధన సమయంలోను ధారణానంతరము అవధాని అనిభూతి.
👇🏻
(నిషిద్ధము) పూరణము.
👇🏻
(శ్రీకారేతరవర్ణము నిషేధము) శ్రీ(ర)దం(మ)బే(క)వె(ల)త(గ)యౌ(న)గా

(మ)నాద(మ)శ్రీ(ర)కూ(ర)డి (వ)భ(ల)ర్గ నా(ద)థా, (న)జే(య)తన్

నీ దయచే రెండింటిని

నీదౌ సమబుద్ధి గొల్తు నన్గృప గనుమా.
అవధాని విజయమును ప్రశంసిస్తూ నా పద్యములు.
👇🏻
శా.  శ్రీమన్మంగళ సద్వధానవిధినే చేపట్టి యీనాడిటన్

క్షేమంబొప్ప శతావధానమున మీ చేవన్ ప్రదర్శించిరే

ప్రేమాంభోనిధి వాణి మీ రసనపై విఖ్యాతిగా నిల్చుతన్

ధీమంతా శతవర్షముల్ వెలుగుడీ దేదీప్యమానంబుగా.


అనేక ద్వివిధకంద గీత గర్భ చంపకమాల.  

నుత పటువాక్ ధనా! కలిగెనో యిటవాణియె కల్పవల్లి యీ

క్షితి నిటనే తమన్ ఘనతకే పటువర్ధనగానొనర్చె వాగ్

గతి యిటులే గుతన్,    జయముగా నిట నిల్చిన సన్నుతాత్మ! యీ

ప్సిత ఘటికా! నినున్ కొలుతు శ్రీ పటుమార్గము కూర్మి  గాంచవా.
(ఘటిక = విద్యాసంస్థ)


శా.  శ్రీమన్మంగళ సద్వధానవిధినే చేపట్టి యీనాడిటన్

క్షేమంబొప్ప శతావధానమున మీ చేవన్ ప్రదర్శించిరే

ప్రేమాంభోనిధి వాణి మీ రసనపై విఖ్యాతిగా నిల్చుతన్

ధీమంతా శతవర్షముల్ వెలుగుడీ దేదీప్యమానంబుగా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.