జైశ్రీరామ్.
జననీ! నుతింతుఁ సరగున
కనవా? పరమేశ్వరీ! సుకరముగ, వరమై,
కనులం వెలుంగు సరసక
వనమై, కరుణించుమమ్మ వరమగు సరణిన్.
పరమేశ్వరీ! సుకరముగ,
వరమై,కనులం వెలుంగు సరసకవనమై,
కరుణించుమమ్మ వరమగు
సరణిన్.జననీ! నుతింతుఁ సరగున ,కనవా?
కనులం వెలుంగు సరసక
వనమై, కరుణించుమమ్మ వరమగు సరణిన్.
జననీ! నుతింతుఁ సరగున
కనవా? పరమేశ్వరీ! సుకరముగ, వరమై,
కరుణించుమమ్మ వరమగు
సరణిన్.జననీ! నుతింతుఁ సరగున ,కనవా?
పరమేశ్వరీ! సుకరముగ,
వరమై,కనులం వెలుంగు సరసకవనమై,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.