జైశ్రీరామ్.
శ్లో. నమన్తి ఫలితా వృక్షాః - నమన్తి విబుధా జనాః ।
శుష్కకాష్ఠానిమూర్ఖాశ్చ - భిద్యన్తే న నమన్తి చ ॥
తే.గీ. ఫలములిచ్చెడి వృక్షముల్ వంగియుండు,
వంగుదురుబుధుల్ చేయుచు వందనమ్మ,
ఎండు కర్రలున్ మూర్ఖులు నెన్నటికి
వంగఁ బోవక వ్రయ్యలౌన్ వసుధపైన.
భావము. ఫలాలను ఇచ్చే చెట్టు ఎల్లప్పుడూ (పండ్ల బరువు కారణంగా, భూమి
వైపు) వంగి ఉంటుంది. అదేవిధంగా, జ్ఞానులు నమస్కరించడం ద్వారా
ఇతరులను గౌరవిస్తారు. అయితే, జ్ఞానం లేని వ్యక్తులు ఎండిన కర్రల
లాంటివారు, అవి రిగిపోతాయి కానీ ఎప్పుడూ వంగవు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.