గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఏప్రిల్ 2025, బుధవారం

నాభ్యుత్థానక్రియా యత్ర ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  నాభ్యుత్థానక్రియా యత్ర  -  నాలాపా మధురాక్షరా |

గుణదోషకథా నైవ  -  తత్ర హర్మ్యే న గమ్యతే ||  (పంచతంత్రం)

తే.గీ.  గౌరవముగ తా నిల్చి స్వాగతము పలుక

నట్టి, తీయగా తగఁ బల్కనట్టి, కష్ట

సుఖములడుగనేర్వనియట్టి సఖుల యింటి

కేగగా రాదు, కనుడు సద్ భాగులార!        

భావము.  నిలచి స్వాగతించని వాడి యింటికి, తీపి మాటలు పలకని 

వాడి యింటికి, కష్ట సుఖాలను విచారించని వాడి ఇంటికి వెళ్ళకూడదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.