జైశ్రీరామ్.
శ్లో. విపత్తిష్వవ్యథో దక్షో - నిత్యముత్థానవాన్నరః|
అప్రమత్తో వినీతాత్మా - నిత్యం భద్రాణి పశ్యతి||
తే.గీ. క్రుంగకాపదలందున క్షోణినిలిచి,
కార్యదక్షుఁడై, స్పృహఁ గల్గి క్రాలువాఁడు,
వినయముననొప్పువాఁడు వివేకశాలి,
శుభములాతనిన్ జేరుచు శోభఁ గొలుపు.
భావము. ఆపత్కాలంలో క్రుంగిపోనివాడికి, కార్యనిర్వహణలో నేర్పు కలవాడికి,
అప్రమత్తంగా మెలిగేవాడికి, వినయవిధేయతలు కలవాడికి ఎల్లప్పుడు శుభాలే
చేకూరతాయి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.