జైశ్రీరామ్.
శ్లో. కలహాంతాని హర్మ్యాణి - కువాక్యాంతం చ సౌహృదమ్|
కురాజాంతాని రాష్ట్రాని - కుకర్మాంతం యశో నృణామ్||
తే.గీ. చెడును గృహములు కలహాన, చేటు కలుగు,
చెడుగ మాటాడ స్నేహంబు చెడును భువిని,
రాజు చెడుగైన చెడిపోవు రాజ్యమెల్ల,
చెడుప్రవర్తన కీర్తికే చేటు తెచ్చు.
భావము. ఇల్లు కలహంతోను, స్నేహం ఒక చెడు వాక్యంతోను, రాజ్యం
చెడ్డరాజుతోను, యశస్సు ఒక చెడు పని చేయటం తోనూ అంతరించిపోతాయి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.