గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2025, సోమవారం

ప్రత్యక్షే గురవః స్తుత్యాఃI ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  ప్రత్యక్షే గురవః స్తుత్యాఃI  -  పరోక్షే మిత్రబాంధవాఃII

కర్మాంతే దాసభృత్యాశ్ఛ I  -  న కదాచన పుత్రకాః II

తే.గీ.  పూజ్య గురుదేవునెదురుగా పొగడ వచ్చు,

ప్రోచు బంధులన్ హితులఁ బరోక్షమందె

అవని పనివార్ని పనిపూర్తి యయిన పిదప,

పుత్రునెప్పుడిన్ బొగడకు పొసగఁబోదు.

భావము.  గురువులను వారి ఎదుటనే స్తుతించ వచ్చు. మిత్రులను 

బంధువులను వారి పరోక్షంలో పొగడాలి. సేవకులను వారి పని ముగిసాక 

పొగడాలి. కొడుకులను ఎప్పుడూ పొగడ కూడదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.