జైశ్రీరామ్.
శ్లో. గిరౌమయూరో, గగనే చ మేఘః. - లక్షాంతరేర్కః, సలిలే చ పద్మః,
లక్షద్వయే గ్లౌః,కుముదాని భూమౌ, - యయోఽస్తి మైత్రీ, న తయోర్హి దూరమ్.
తే.గీ. పురిని విప్పు మేఘుని గాంచి భుజగభోగి,
పద్మములురవిన్ గాంచినన్ బరవశించు,
కలువలాకాశ చంద్రుని గాంచి పొంగు,
మిత్రులకుమధ్య దూరంబు ధాత్రి లేదు.
భావము. ఏ ఇరువురి మధ్య స్నేహము ఉంటుందో వారికి దూరముతో
నిమిత్తము ఉండదు. ఏ విధముగాననగా నెమళ్ళు కొండలపై ఉంటాయి.
మేఘాలు ఆకాశంలో ఉంటాయి ఐనా కాని స్నేహితుఁడైన మేఘుఁడు రాగానే
అవి పురివిప్పి ఆడతాయి. లక్షయోజనాల దూరంలో సూర్యుఁడుంటాడు.
ఐనా కాని అతనిత్రో మైత్రిని ఒప్పే పద్మము అతఁడు ఉదయించగానే
ఆనందంతో వికసిస్తుంది. చంద్రుఁడు రెండులక్షల యోజనాలదూరంలో
ఉంటాడు. ఐనా కాని అతడు ఉదయించగానే అతనితో మైత్రి కలిగిన కలువలు
వికసిస్తాయి. దీనిని పట్టి స్నేహానికి దూరంతో నిమిత్తం లేదని అర్థమగును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.