జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
సుదర్శన వృత్త గర్భ భావగోపన చిత్ర మత్తకోకిల.
సుదర్శన వృత్తము.. గణములు, ర,స,య,జ,జ,గ. యతి: 9
మోహమున్ విడఁ జేయుమా(నను)భూమిపై వరలింపుమా,
శ్రీహరీ నిను గొల్చెదన్ (గను)చిత్తమందువసించుచున్,
దేహమందున నీవెగా (నుత)దీప్తివైతివి ప్రాణమై,
దేహమున్విడు వేళలో (హరి!)దివ్యతేజము జూపుమా.
గోపనభావము (నను - గను - నుత - హరి.)
అమ్మ దయతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.