చలితకాశ్మీరం.😢
అక్రమంగా దొంగతనంగా పాకిస్తాన్ నుండి భారత దేశంలోనికి ప్రవేశించిన పాకిస్తాన్ టెర్రరిష్టు ముష్కరులు 22 - 4 - 2025వ తేదీన విహార యాత్ర కొఱకు కాశ్మీర్ పహల్గామ్ వచ్చియున్న భారతీయ హిందువులను ఏరి అతి కిరాతకంగా సుమారు ముప్ఫైమందిని కాల్చి చంపారు. ఈ అత్యంత కిరాతకమైన పాకిస్తాన్ టెర్రరిష్టుల దుశ్చర్య నా హృదయాన్ని కలిచివేసింది. ఎంతో ప్రశాంతంగా ఉండే హిందువులను అతి దుర్మార్గంగా సంహరించడం ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది. ఇటుపై ఇటువంటి పరిస్థితి మరి చరిత్రలో జరకుండా ఉండే విధంగా మన ప్రభుత్వ అత్యంత కఠినాతికఠినమైన చర్య పాకిస్తాన్ పై చేపట్టి హిందువుల ఆత్మస్థైర్యం కోల్పోకుండా చాడాలని ఆశిస్తున్నాను.
సీ. పదునారు రోజుల పండుగైనను లేదు పదినాళ్ళకాపురం బండలయ్యె,
స్త్రీమూర్తి నుదుటిపై సిందూరకాంతులన్
చెరిపిన ముష్కరుల్ చెడి నశింత్రు,
నా తల్లి శాంభవిన్ నమ్మిన వనితల దుఃఖకారకులిలఁ దునుమబడుత,
హాయిగా విహరింప నమరకాశ్మీరంబు నరిగిన వారలే యమరులయిరె,
తే.గీ. ఇంత దుస్స్థితి నింకపైనెపుడుకూడ
కలుగకుండుచు కాశ్మీరు వెలయుగాక,
భరతమాతకు కాశ్మీరుప్రభలనీను
దివ్యసిందూరతిలకంబు దీప్తగనుత.
🙏🏻🙏🏻🙏🏻
ఇది వ్రాస్తున్న సమయంలో అక్కడి దుస్థితికి కన్నులు నీళ్ళతో నిండిపోయి సరిగా వ్రాయలేకపోయాను.😢
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.