గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఏప్రిల్ 2025, గురువారం

ఉత్తమైరుత్తమైర్నిత్యం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  ఉత్తమైరుత్తమైర్నిత్యం   -  సంబంధానాచరేత్సహ |

నినీషుః కులముత్కర్షమ్అ  -  ధమానధమాంస్త్యజేత్ ||  (మనుస్మృతి)        

తే.గీ.  ఉత్తమున కుత్తములతోడ నొప్పు పొత్తు,

బంధములుకల్పుకొననది పరగు ధరను,

కానినాడది నిలువదు, కర్మఁగాల్చు,

నుత్తముఁడు గానివానితో పొత్తదేల?

భావము.  ఎప్పుడూ విద్య, ఆచారాలలో శ్రేష్ఠులైన వారితోనే సంబంధాలను పెంచి, 

అలాంటివారితోనే  కుమార్తెను ఇచ్చిపుచ్చుకోవడం చేసి తన వంశాన్ని ఉన్నతంగా 

తయారుచేయవచ్చు. తమకన్న అధములను త్యజించాలి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.