గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఏప్రిల్ 2025, బుధవారం

ఒక కందంలో అష్టదిక్పాలక, దశావతారాల నామ స్మరణ..... కవి.. భట్టుమూర్తిసరికొండ లక్ష్మీనర సింహ రాజు. తిరుపతివేంకట కవుల పద్యం కూడా. సేకరణ సమర్పణ. శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు.

 జైశ్రీరామ్.

భట్టుమూర్తిసరికొండ లక్ష్మీనర సింహ రాజు అనే కవివర్యుడు 

ఒక కందంలో అష్టదిక్పాలక, దశావతారాల నామ స్మరణ చేయటం విశేషం.

ఆ కందం----

క.  హరి శిఖి యమ దనుజ వరుణ

హరి రాజేశ్వరులు మఱియు-అండజ ఢులి సూ

కర నృహరి వటు సుభార్గవ

నరవర బల బౌద్ధ కలికి-నాములు బ్రోవున్.

అష్టదిక్పతులు

1హరి =ఇంద్రుడు ,    

2శిఖి= అగ్ని,

3యమ=యమధర్మ రాజు,

4దనుజ=నైరుతి,

5వరుణ=వరుణదేవ

6హరి=వాయువు,

7రాజా=కుబేరుడు,

8ఈశ్వర=ఈశాన్యుడు


అవతారాలు                       

1అండజ= మత్స్య ,

2ఢులి=కూర్మ,

3సూకర=వరాహ,

4నృహరి=నరసింహ,

5వటు=వామన,

6సుభార్గవ=పరశురామ,

7నరవర=రామ,

8బల=బలరామ,

9బౌద్ధ=బుద్ధ,

10కలికి=కల్కి

అటులనే

తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానంలో చెప్పిన 

మరొక పద్యం

క.  జలచర ఢులి కిరి నరహరి

కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం

డిల తిరుపతి వేంకటశా

స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.

తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానంలో చెప్పిన పద్యం ఇది.

ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన 

అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన  'అయ్యా, దశావతారాలను గురించి 

వర్ణించండి'.ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా 

ఉండాలి.'  దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి' అని అడుగగా చెప్పిన పద్యం.

జలచర ౧

ఢులి ౧

కిరి ౧

నరహరి౧

కలిత వటు ౧

త్రివిధ రామ ౩

కల్కులు ౧

బుద్ధుం౧

తిరుపతి 

వేంకటశాస్త్రులను 

పరబ్రహ్మశాస్త్రి

సేకరణ సమర్పణ. శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.