గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఏప్రిల్ 2025, గురువారం

చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి చక్కని పద్యరాజం. నిశ్చలమయి యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి.

 జైశ్రీరామ్.

సీ.  అన్నదానము గొప్పదనవచ్చునేకాని అన్నంబు జాములో నరిగిపోవు 

వస్త్రదానము గూడ భవ్యదానమె కాని వస్త్ర మేడాదిలో పాతదగును 

గృహదానమొకటి యుత్కృష్టదానమె కాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు

భూమి దానము మహాపుణ్యదానమె కాని భూమియన్యుల జేరిపోవవచ్చు

తే.గీ.  అరిగిపోక, ఇంచుకయేని చిరిగిపోక 

కూలిపోవక యన్యుల పాలుగాక

నిత్యమయి, వినిర్మలమయి, నిశ్చలమయి 

యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.