గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఏప్రిల్ 2025, మంగళవారం

న నరస్య నరో దాసో ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్

శ్లో.  న నరస్య నరో దాసో  -  దాసస్త్యర్థస్య భూపతే |

గౌరవం లాఘవం వాపి  -  ధనాధననిబంధనమ్ || (హితోపదేశం)

తే.గీ.  నరుఁడు దాసుడు కాడిల నరులకెన్న,

ధనమునకుమాత్రమే యగు దాసునిగను,

సుగుణధము సద్ధనమౌను చూడగాను,

గౌరవాగౌరవములబ్బు కలిమిఁ బట్టి. 

భావము.  మనిషికి మనిషి దాసుడు కాదు, అతను ధనానికి దాసుడు. 

గౌరవం ఉండటం, లేకపోవటం అనేవి మనిషి వద్ద ఉన్న ధనంపై 

ఆధారపడి ఉంటాయి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.