జైశ్రీరామ్.
శ్లో. విపదో నైవ విపదః - సంపదో నైవ సంపదః |
విపద్ విస్మరణం విష్ణోః - సంపన్నారాయణస్మృతిః ||
తే.గీ. ఘనవిపత్తుల్ విపత్తులు కావు కావు,
కనగ సంపదల్ సంపదల్ కావు కావు,
భవ్యవిష్ణు సంస్మరణ సంపత్తియగును,
పద్మనాభుని మరువ విపత్తియదియె.
భావము. విపత్తులు విపత్తులు కావు. ఐశ్వర్యాలు ఐశ్వర్యాలు కావు. విష్ణువును
మరచిపోవడమే నిజమైన విపత్తు. ఆయనను స్మరించుకోవడమే నిజమైన సంపద.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.