గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2025, బుధవారం

అష్టదళపద్మ బంధ సుదర్శనవృత్త గర్భ మత్తకోకిల. రచన... చింతా రామకృష్ణారావు. చిత్ర నిర్మాణము శ్రీమతి మోతే హరిప్రియ.

జైశ్రీరామ్. 

అష్టదళపద్మ బంధ సుదర్శనవృత్తగర్భ మత్తకోకిల.

రామనామము పల్కరా క్షితి రా ముఁడే మన రక్షరా!

రాముఁడేలిక యౌనురా, పతి రాముఁడద్భుత శక్తిరా,

రామరాజ్యము మేలురా, రఘు రామభక్తియె తోడురా,

రాముఁడే మది నుండురా, వర రామయంచు తరింపరా.

మత్తకోకిల గర్భస్థ సుదర్శన వృత్తము

గణములు – ర . స . య . జ . జ . గ .  యతి: 9

రామనామము పల్కరా, రా ముఁడే మన రక్షరా,

రాముఁడేలిక యౌనురా, రాముఁడద్భుత శక్తిరా,

రామరాజ్యము మేలురా, రామభక్తియె తోడురా,

రాముఁడే మది నుండురా, రామయంచు తరింపరా.

అష్టదళపద్మ బంధ సుదర్శనవృత్తము.

ఈ పద్యమును చిత్రములో బంధించిన సహృదయశిరోమణి చి.ల.సౌ. మోతే హరిప్రియకు 

సమస్త మంగళములు కలుగుగాక.

ఉ. అద్భుతమమ్మ చిత్రము, మహాద్భుతమమ్మరొ! నీదు దీక్ష, జ్ఞా

నోద్భవ చిత్రలేఖన మహో!యని మెచ్చగనుండెనమ్మ! భ

క్త్యుద్భవ దివ్యతేజమది యున్నత సత్ఫలమందజేయ సం

పద్భవ మంగళంబులను భాసిలగొల్పును నీ గృహంబునన్.🙌

జైహింద్.



Print this post

2 comments:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

శుభాభినందనలండీ!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యవాదాలు మధుసూదన్ గారూ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.