గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఫిబ్రవరి 2025, శనివారం

నో దేశ కాలనియమః . ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  నో దేశ కాలనియమః   -  శౌచాశౌచ వినిర్ణయః!

పరం సంకీర్తనాదేవ  -  రామరామేతి ముచ్యతే!!

తే.గీ.  పలుక శ్రీ రామ రామాంచు పరవశమున

దేశకాలాల పనియేల? దీపితమగు

నాత్మ శౌచంబునకుమించి యన్యమేల?

బంధముక్తులమై ముక్తి పడయుదుముగ.

భావము.  పరమాత్మ ధ్యానమునకు దేశకాల నియమం లేదు. అదేవిధముగనే 

శౌచ-అశౌచ బేధమూ లేదు. శ్రీరామరామ అను పరమోత్కృష్టమగు సంకీర్తనను 

ఏ సమయమందు చేసినను బంధములనుండి విముక్తులగుదురు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.